Site icon TeluguMirchi.com

అనుష్క కు కూతురు…

Rudharamadevi-23గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో చారిత్రక చిత్రంగా రూపొందుతున్న ‘రుద్రమదేవి’. ఇప్పటికే ఈ చిత్రం లో చాలా మంది ప్రముఖ నటి నటులు నటిస్తున్న సంగతి తెలుసు. రుద్రమదేవి గా అనుష్క నటిస్తుండగా అనుష్క కూతురిగా నిత్య మీనన్ నటిస్తుంది. చాళిక్య వీరభద్రుడు (రానా) , రుద్రమదేవి (అనుష్క ) దంపతుల కూతురు ముమ్మి డమ్మాగా (నిత్య మీనన్) నటిస్తుంది.

అలాగే రుద్రమదేవి స్నేహితురాలుగా అనామిక (కాథరిన్ ) గా గోన గన్నారెడ్డి (అల్లు అర్జున్ ) ని ప్రేమించే పాత్రలో నటిస్తుంది. ఇక ఈ చిత్ర ఆడియో ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు చిత్ర నిర్మాత గుణశేఖర్. మొదటగా వైజాగ్ లో మూడు పాటలను ఉగాది కానుకగా విడుదల చేసి, మరో మూడు పాటలను 22 వ తేది న వరంగల్ లో విడుదల చేస్తున్నారు. ఈ రెండు చోట్ల చిత్ర నటి నటులు పాల్గొనున్నారు.

Exit mobile version