Site icon TeluguMirchi.com

’రెండింటిలో..’ అయితే ఓకే !

anushkaa

స్వీటీ అనుష్క సూపర్ స్టార్స్ తో జతకడుతూ.. క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇప్పటికే స్వీటీ చేతిలో చాలా సినిమాలే వున్నాయి. ఇంకా, కొత్త సినిమాలకి డేట్స్ ఇవ్వడానికి కూడా రెడీగా వుంది. కానీ.. కండీషన్స్ అప్లయ్ అంటోంది. కేవలం తెలుగులోనో, లేక తమిళంలోనో మాత్రమే సినిమా తీస్తామంటే కుదరదు.. తాను ద్విభాషా చిత్రాలలో మాత్రమే నటిస్తాని తెగేసి చెబుతోంది. తన డేట్స్ కావాలనుకునే వాళ్లు తెలుగు+తమిళ్ లో సినిమాని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తోంది స్వీటీ. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న బాహుబలి, రజనీకాంత్ లింగా, రుద్రమదేవి, అజిత్ సినిమా … ఇవన్నీ కూడా ద్విభాషా చిత్రాలే. అదేంటీ.. అంటే.. కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు టచ్ లో వుండొచ్చు. పారితోషికం కూడా భారీగానే వుంటుంది కదండీ అంటోంది స్వీట్ స్మైల్ తో..

Exit mobile version