స్వీటీకి సర్రున కోపం వచ్చింది

anushkaముద్దుగుమ్మ స్వీటీకి ఏ ప్రశ్న అడిగినా పర్వాలేదు, కాని పెళ్లి విషయం, ప్రేమలో ఉన్నారా అనే ప్రశ్న వేసిన వెంటనే సర్రున కోపం వస్తుంది. గతంలో పలు సార్లు అనుష్క ఈ విషయమై ఆగ్రహించిన సందర్బాలు ఉన్నాయి. తాజాగా మరోసారి అదే విషయంపై అనుష్క ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈమె నటించిన ‘బాహుబలి 2’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

బాహుబలి 2 చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా అనుష్క తమిళ మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆ సందర్బంగా మీడియాకు సంబంధించిన వ్యక్తి మాట్లాడుతూ మీకు త్వరలో పెళ్లి అని, ఒక వ్యాపార వేత్తతో మీ వివాహం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి కదా అంటూ ప్రశించాడు. దాంతో ఆమె ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పెళ్లి విషయం తప్ప మరే ముఖ్యమైన విషయం లేదా అంటూ సదరు మీడియా పర్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన పెళ్లి విషయం గురించి మీడియాలో వచ్చిన వార్తలపై పలు సార్లు క్లారిటీ ఇచ్చాను, మళ్లీ అదే క్లారిటీ నా నుండి ఆశించడం మంచి పద్దతి కాదు అంటూ అనుష్క ఆగ్రహంగా తర్వాత ప్రశ్న ఏంటి అంటూ తన ఆగ్రహాన్ని దిగమింగుకున్నట్లుగా తెలుస్తోంది.