Sharwa38 : శర్వానంద్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్..


Sharwa38 : చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38 ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా, శర్వా-సంపత్ కాంబినేషన్‌కు ఒక మైలురాయిగా నిలవనుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో హై బడ్జెట్‌లో నిర్మించబడుతుంది. ఇందులో శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు. కథలో అనుపమ పాత్ర చాలా కీలకంగా వుండబోతోంది. ఇక అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో అనుపమ 1960ల నాటి థీమ్స్‌కు తగిన విధంగా రగ్గడ్ లుక్‌లో కనిపించి, సినిమాకు మరింత ఆసక్తిని పెంచింది.

Also Read :  CM Pellam : ప్రజాసేవపై ప్రశ్నలు వేసే సినిమా – మే 9న థియేటర్లలో

Also Read : Naga Chaitanya : NC24 స్పెషల్ వీడియో.. మైథలాజికల్ థ్రిల్లర్ తో వస్తున్న చైతూ

1960ల చివరలో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో #Sharwa38 హై-స్టేక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. అంతేకాదు ఈ సినిమా కోసం శర్వా ప్రత్యేకమైన మేకోవర్ చేసుకున్నారు. టాప్ టెక్నీషియన్స్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.. సినిమాటోగ్రఫీకి సౌందర్ రాజన్ S, సంగీతానికి భీమ్స్ సిసిరోలియో, ఆర్ట్ డైరెక్షన్‌కు కిరణ్ కుమార్ మన్నె బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.