మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత ఏడాది నటించిన ‘రంగస్థలం’ నాన్ బాహుబలి రికార్డును దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంలో చరణ్‌కు ఏమాత్రం తగ్గకుండా సమంత నటించి మెప్పించింది. ఇద్దరి జోడీకి వందకు వంద మార్కులు పడ్డాయి. సుకుమార్ వీరిద్దరిని అద్బుతంగా చూపించాడు. పల్లెటూరి అమ్మాయిగా సమంత నటించిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఆ పాత్రకు మొదట అనుపమ పరమేశ్వరన్‌ను అనుకున్నారట.
తాజాగా ఆ విషయమై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రంగస్థలం చిత్రం కోసం మొదట నన్నే సంప్రదించారు. అయితే ఆ సమయంలో ఇతర సినిమాలు ఉండటం వల్ల డేట్లు సర్దుబాటు కాలేదు. ఆ కారణంగా సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. ఆ సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికి చాలా బాధాగానే ఉంటుంది. అయితే సినిమా విడుదలైన తర్వాత చూస్తే సమంత చాలా బాగా చేసింది అనిపించింది. ఆమె పాత్రకు సరిగ్గా సూట్ అయ్యింది. ఇక తాజాగా ఈమె రాక్షసుడు చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇంకా రెండు మూడు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.