ఇక గ్లామర్ పాత్రలపై కూడా తనదైన రీతిలో స్పందించింది అనుపమ. గ్లామర్‌గా కనబడడం అంటే కేవలం స్కిన్ షో చేయడం కాదు, లంగా ఓణి, చీర, పంజాబీ డ్రస్‌లో కూడా గ్లామర్‌గా కనిపించవచ్చు అని వివరణ ఇచ్చింది. ఆ తర్వాత కాబోయే భర్త గురించి మీడియా ప్రతినిధి అడగగా నేను ఇంకా చిన్న పిల్లనే… ఆ విషయం ఆలోచించేంత పెద్దదాన్ని కాదు, దాని గురించి మాట్లాడే వయస్సు నాది కాదు, ఆ విషయం గురించి అడక్కండీ ప్లీజ్ అంటూ చాలా క్యూట్ క్యూట్‌గా వివరణ ఇచ్చింది. సక్సెస్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అనుపమకు పెద్ద హీరోల అవకాశాలు కూడా తక్కువ సమయంలోనే వస్తున్నాయి అంటే అందుకు ఆమె నటనే కారణం. తన నటనతో ప్రేక్షకులను మాత్రమే కాకుండా సినీ వర్గాల వారిని కూడా పడేస్తుంది పొట్టిగుమ్మ అనుపమ పరమేశ్వరన్.