అనుపమ తల్లిని చూసి షాక్ అవుతున్నారు..

Anupama-mother‘అ..ఆ’ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయినా మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్..మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది..అంతే కాదు తన రోల్ కు తానే డబ్బింగ్ చెప్పుకొని ఆశ్చర్యపరిచింది. ఇక తాజాగా నిన్న రిలీజ్ అయినా ‘ప్రేమమ్’ చిత్రంతో మరోసారి ఆకట్టుకుంది.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో `శతమానం భవతీ` చిత్రం లో శర్వానంద్ తో కలిసి నటిస్తోంది. ఇప్పటికే తెలుగు , తమిళ్ , మలయాళ భాషల చిత్రాలతో బిజీ గా ఉన్న ఈ భామ , ఖాళీ దొరికితే చాల తన ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తుంటుంది..ఇటీవలే తన తల్లి తో కలిసి సముద్రపు అందాల్ని ఆస్వాదిస్తోంది. పనిలో పనిగా అమ్మతో కలిసి సెల్ఫీ తీసుకొని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్ చూసినవారంతా మీ అమ్మ నీకు అక్కలా ఉంది అంటూ కామెంట్స్ వేస్తున్నారు. వాస్తవంగా అనుపమ తల్లి అంటే ఎవరుకూడా నమ్మరు..ఇద్దరు తల్లి , కూతుర్లుగానే లేరు.