మాస్ మహారాజా రవితేజ 71 వ చిత్రం టైగర్ నాగేశ్వరరావు. గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్న ఈ సినిమాకి వంశీ దర్శకుడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడిని తీసుకున్నారు. ఇందులోని కీలక పాత్ర కోసం లెజండిరీ యాక్టర్, నేషనల్ అవార్డు గ్రహీత అనుపం ఖేర్ ని ఎంపిక చేశారు. ఈయన ఎంఎస్ ధోని బయోగ్రఫీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ మేరకు ఆయన ఫస్ల్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తన 528వ చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉందంటూ అనుపం ఖేర్ ట్వీట్ చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో మాస్ మహారాజా సిక్స్ ప్యాక్ బాడీగలో కనిపిస్తారని టాక్ వస్తోంది. ప్రస్తుతం రూ.7 కోట్లతో వేసిన సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. రవితేజ సరసన నుపుర్ సనన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. రేణు దేశాయ్, గాయత్రి భార్గవి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.