తెరపై తనదైన అందంతో, అభినయంతో అందరిని ఆకట్టుకునే అనూ ఇమాన్యుయెల్ వరుస చిత్రాలతో బిజీగా ఉంటోంది. ఈ అమ్మడి నటనకు పవన్ కళ్యాణ్‌కు కూడా పడిపోయి వెంటనే తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. తాజాగా మీడియాతో ముచ్చటించిన అనూకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. కాగా ఆ ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను, ప్రేమించి అర్థం చేసుకుని, అతని గూర్చి పూర్తిగా తెలుసుకున్నాకే పరిణయమాడుతాను అని అను చెప్పుకొచ్చింది.
ఇవన్నీ చేయాలంటే ముందుగా టైం ఉండాలి, కానీ అంత టైం నాకిప్పుడు లేదు. ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది, ప్రస్తుతం దృష్టి అంతా కూడా సినిమాల పైనే ఉంది అని ఈ అమ్మడు చాలా క్లారిటీగా పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. పవన్,త్రివిక్రమ్‌ల చిత్రంలో అవకాశం రావడం నా అదృష్టం. పవన్ సినిమా అనగానే పాత్ర గురించి అడగకుండానే ఒకే చెప్పాను, మొదట్లో పవన్‌తో నటించడానికి చాలా భయపడ్డాను, కానీ ఆ తర్వాత ఆయన కలుపుగోలు తనం చూసి షాకయ్యా. ఆ తర్వాత అంతా సెట్ అయ్యింది ఈ అని అనూ ఇమాన్యుయెల్ చెప్పుకొచ్చింది.