Site icon TeluguMirchi.com

25న ‘అంతకుముందు ఆ తరువాత’ ఆడియో

antahumundu aa taruvataశ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్, ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం… ఆడియో వేడుక ఈ నెల 25న హైదరాబాద్ లో చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుగుతుందని నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ తెలిపారు. సంగీత దర్శకుడు ‘కల్యాణి కోడూరి’ ఈ చిత్రానికి వీనుల విందైన సంగీతాన్ని సమకూర్చారు.’అలా మొదలైంది’ లానే ఈ చిత్రం ఆడియో కూడా సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేసారు చిత్ర దర్శక, నిర్మాతలు. సుప్రసిద్ధ గీత రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, అనంతశ్రీరాంలు ఈ గీతాలను రచించారు.

Exit mobile version