అంత సీన్ లేదు..

antha-seen-leduనవదీప్, శశాంక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “అంత సీన్ లేదు”. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాడ్ మంకీ పతాకంపై చక్రవర్తి రామచంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర విశేషాల గురించి నిర్మాత చక్రవర్తి రామచంద్ర మాట్లాడుతూ… “కొత్త తరహా క్రైమ్ కామెడి స్టొరీతో రూపొందుతున్న చిత్రం ’అంత సీన్ లేదు’ అని తెలిపారు. సినిమా ఆమాంతం ఉత్కంఠ భరితంగా సాగుతూ.. ప్రేక్షకులను థ్రిల్ ని ఇస్తుందని నిర్మాత అన్నారు. దర్శకుడు వెంకట్ కాచర్ల మాట్లాడుతూ.. ‘అంత సీన్ లేదు’ స్టొరీ ఒక రోజు రాత్రి జరిగిన సంఘటనల చుట్టు తిరుగుతుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం కల్యాణికోడూరి. అన్నట్టు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.