Site icon TeluguMirchi.com

చరణ్ తో అలా పిలిపించుకోవడం ఇష్టం లేదు : అనసూయ

‘రంగస్థలం’ మొదలైనప్పటి నుంచి వచ్చిన ఊహాగానాలన్నీ తప్పని, తాను ఈ సినిమాలో సమంతకు తల్లి పాత్రలో నటించలేదని చెప్పింది అనసూయ.‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనసూయ మాట్లాడింది. ‘రంగస్థలం’ చిత్ర బృందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో నేను సమంతకు తల్లి పాత్రలో నటించడం లేదు. కేవలం రంగమ్మత్త అనే పాత్రలో నటిస్తున్నా. సినిమా విషయంలో నా ధైర్యం అంతా సుకుమార్‌గారు. రామ్‌చరణ్‌ నా ఫెవరెట్‌ యాక్టర్‌. ఆయనతో అత్త పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పా. కానీ, డబ్బింగ్‌కు వచ్చే సరికి ఆ పాత్రలో పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయిపోయా. ‘రంగస్థలం’ ద్వారా మిమ్మల్ని కచ్చితంగా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాం’ చెప్పుకొచ్చింది.

అనంతరం సుమ మాట్లాడుతూ తనను కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు అక్కగా తీసుకోవాలని ముందుగా అనుకున్నారని, కానీ తనలాంటి నటిని తీసుకుంటే చెల్లిగా తీసుకోవాలని కానీ అక్కగా తీసుకుంటే బాగుండదని తీసుకోలేదని చమత్కరించింది.

Exit mobile version