ధనుష్ నుండి మరో ‘కొలవరి డి’

kolavari diగతంలో ”వై  దిస్  కొలవెరి  కొలవెరి  కొలవెరి డి” పాటతో దాదాపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో ధనుష్. ఈ పాట గంగ్నమ్ సాంగ్ తో  సరాసరి గా యుట్యూబ్ లో అత్యధిక వీక్షకుల లిస్టులో చేరిపోయింది. ఇప్పుడు తన అన్నయ్య సెల్వ రాఘవన్ కోసం మరో పాట పాటపాడబోతున్నాడు ధనుష్. ఆర్య, అనుష్క హీరో, హీరోయిన్లుగా  దర్శకుడు సెల్వరాఘవన్  రూపొందిస్తున్న చిత్రం  ‘ఇరండామ్ ఉలగమ్’. హ్యరిస్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను కంపోజ్ చేశాడు హరీష్ . అయితే సింగర్ విషయంలో ధనుష్ అయితే బాగుంటుందని దర్శకుడికి చెప్పాడు. దర్శకుడు సెల్వరాఘవన్ కి ధనుష్ సొంత తమ్ముడు కావడంతో… అడిగిన వెంటనే ఓకే  అన్నాడట. ధనుష్ కు ఈ స్పెషల్ సాంగ్  మరో ‘కొలవరి డి’  లాంటి సూపర్ ట్రాక్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. ‘ఇరండామ్ ఉలగమ్’ చిత్రం తెలుగులో “బృందావనంలో నందకుమారుడు” పేరిట విడుదలకానుంది.