1000 సినిమాల హాస్య బ్రహ్మా

Brahmanandamబ్రహ్మానందం ఈ పేరు తెలియని వారుండరు…ఒక రకంగా బ్రమ్మి లేని సినిమాలు ఉండవనే చెప్పాలి. సినిమా ఎలా ఉన్నా సరే కేవలం బ్రహ్మానందం కామెడితో హిట్‌ అయిన చిత్రాలు చాలా ఉన్నాయి. ప్రతి హీరో కూడా బ్రమ్మి లేకుండా సినిమానా అసలు ఆడుతుందా అనుకునేంతగా తెలుగు తెరలో చిరస్థాయిగా హాస్య బ్రహ్మాగా నిలిపోయాడు. అత్తిలిలో లెక్చరర్‌గా కెరీర్‌ ప్రారంభించిన బ్రహ్మానందం…1985లో దూరదర్శన్లో వచ్చిన ‘పకపకలు’ కార్యక్రమాన్ని సమర్ధంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్‌ వేసి నిలబెట్టినవారు దర్శకులు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్‌ హీరోగా నటించిన ‘శీ తాతావతారం’ అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించారు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. ప్రస్తుతం వరకు 997 సినిమాల్లో నటించారు. బ్రహ్మానందం త్వరలో 1000 సినిమాలు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. తన కామెడితో గిన్నిస్‌ బుక్‌ రికార్డుతో పాటు…పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు. బ్రహ్మి ఇలాగే తన కామెడితో ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుందాం..!