మరో హిట్ రీమేక్ లో వెంకీ

venkatshవిక్టరీ వెంకటేష్ మరో రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ మళయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ కు చేయడానికి వెంకీ డిసైడ్ అయ్యారు. మలయాళంలో విజయం సాదించిన ‘దృశ్యం’ చిత్రాన్ని వెంకీ లీడ్ రోల్లో రీమేక్ చేస్తున్నారు. మోహన్ లాల్ – మీన జంటగా నటించిన ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంశలను పొందింది. ఈ రీమేక్ ను వైడ్ యాంగిల్ ఫిల్మ్స్ సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.