మ‌రో హ్యాపీడేస్‌…

Sekhar_Kammula_Life-is-Beautiful_కొత్తవారితో అద్భుతాలు సృష్టించొచ్చు అని నిరూపించిన ద‌ర్శకుల్లో శేఖ‌ర్ క‌మ్ముల ఒక‌రు. గోదారి అందాల‌ను చూస్తూ చిక్కటి కాఫీ తాగిన అనుభూతి క‌లిగిస్తాయి… ఆయ‌న సినిమాలు. అభిరుచి, సృజ‌న‌, సినిమాపై ఆయ‌న‌కున్న ప్రేమ ఇవ‌న్నీ క‌ల‌గ‌ల‌సి ఆయ‌న్ని ఓ ఉత్తమ ద‌ర్శకుడిగా తీర్చిదిద్దాయి. ఇప్పుడాయ‌న న‌య‌న‌తార‌తో అనామిక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ చిత్రం క‌హానికి ఇది రీమేక్‌.. ఈ చిత్రం తుది ద‌శ‌కు చేరుకొంది. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈలోగా శేఖ‌ర్ మ‌ళ్లీ త‌న పాత స్కూలుకి వెళ్లిపోయాడు. పూర్తిగా కొత్తవారితో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఆడిష‌న్స్ కూడా త్వర‌లో మొద‌ల‌వుతాయి. ఫేస్ బుక్ ద్వారా కొత్తవారిని ఎంచుకొనే ప్రయ‌త్నాల్లో ఉన్నారాయ‌న‌. చూద్దాం మ‌రో హ్యాపీడేస్ తీస్తారేమో…?