నిఖిల్‌కి మ‌రో ఛాన్స్‌!

krishna-vamsi-nikilయువ హీరో నిఖిల్‌ పై మ‌ళ్లీ ద‌ర్శక నిర్మాత‌ల దృష్టి ప‌డింది. ‘స్వామి రారా..’ విజ‌యంతో మ‌ళ్లీ ఆయ‌న అందరినీ ఆకర్షిస్తున్నాడు. క‌థ‌, క‌థ‌నాల విష‌యంలో కాస్త జాగ్రత్త తీసుకొంటే నిఖిల్‌ తో మంచి సినిమాలే తీయొచ్చు అనే ధీమా పెరిగింది. తాజాగా మ‌రో మంచి అవ‌కాశం అందుకొన్నట్టు స‌మాచారం. క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ‌వంశీ దృష్టిలో ప‌డ్డాడు నిఖిల్‌. ఈ యంగ్ టాలెంట్‌ తో ఓ సినిమా చేయాల‌ని వంశీ డిసైడ్ అయ్యాడ‌ట‌. ప్రస్తుతం ఆయ‌న నానితో పైసా రూపొందిస్తున్నారు. ఆ సినిమా త‌ర‌వాత నిఖిల్‌ తో సినిమా ఉంటుంది. ఈ క‌థ‌లో మ‌రో యంగ్ హీరోకీ అవ‌కాశం ఉన్నట్టు స‌మాచారం. ఆ అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.