Site icon TeluguMirchi.com

షాడో తో సీతమ్మ?

venkatesh-anjali‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో వెంకటేష్ సరసన సందడి చేసిన అంజలి మరోసారి వెంకీ తో జతకట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో హిట్టయిన ‘బోల్ బచ్చన్’ సినిమాని వెంకీ,రామ్ ప్రధాన పాత్రలలో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ఆశిన్ చేసిన పాత్రకు తెలుగులో అంజలిని సంప్రదిస్తున్నట్లు వినికిడి. విజయభాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ తరువాత వెంకటేష్, విజయ భాస్కర్ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ మరియు డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version