Site icon TeluguMirchi.com

రజనీ మూవీ లో జాతీయ అవార్డు విన్నర్..?

రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ‘2.0’ మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే..ఇప్పటికే ఈ మూవీ కి సంబదించిన షూటింగ్ కూడా పూర్తి చేసాడు. త్వరలోనే కబాలి దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వం లో ‘కాలా ‘ అనే మూవీ చేయబోతున్నాడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అంజలి పాటిల్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. గతం లో నా బంగారు తల్లి చిత్రం లో నటించి జాతీయ అవార్డు సైతం అంజలి దక్కించుకొని , తన అద్భుత నటన తో యావత్ సినీ లోకాన్ని అలరించింది. ఇప్పుడు రజని మూవీ లో నటించే ఛాన్స్ కొట్టినట్లు సమాచారం. మాఫియా నేపథ్యం లో ఈ మూవీ తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ మూవీ లో దర్శకుడు & నటుడు సముద్రఖని నటిస్తున్నాడు. ధనుష్ తన ఉండర్‌బార్‌ ఫిలిమ్స్‌ సంస్థ తరఫున ఈ చిత్రం నిర్మించనుండగా సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version