రియల్ దెయ్యానికి భయపడే అంజలి వేరే ఇంట్లోకి మారిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇకపై హార్రర్ చిత్రాలలో కూడా నటించకూడదని అంజలి డిసైడ్ అయ్యిందట. దెయ్యం అరుపులను విన్న అంజలి ప్రస్తుతం ఒంటరిగా ఎక్కడకు వెళ్లడం లేదని సమాచారం అందుతోంది. దెయ్యాల చిత్రంలో నటించిన అంజలికి అదంతా కూడా ఆలాపాన లేక నిజంగా దెయ్యం అంజలి వెంట పడిందా..?? అనేది మాత్రం అంజలియే చెప్పాల్సి ఉంది. రీల్ దెయ్యాన్ని రియల్ దెయ్యం నిజంగా గడగడలాడించిందా లేదా అనే విషయంపై అంజలి స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.