తెలుగు అమ్మాయి అంజలి తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ అమ్మడికి తెలుగులో కాస్త పాపులారటి తక్కువే అయినా కూడా తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉంది. తన అందం, నటన, స్వరంతో ఈ అమ్మడు ఆకట్టుకుంటూ ఉంటోంది. తాజాగా అంజలి మీడియాతో మాట్టాడుతూ తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంది. అంజలి ఇంటర్ చదివే సమయంలో తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి’ సినిమా విడుదల అయ్యిందట. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో అంజలి కూడా వెళ్లడానికి సిద్దమయ్యింది. ఫ్రెండ్స్‌తో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని అంజలి అనుకుంది.
అనుకున్న విధంగానే అంజలి తన స్నేహితులతో ‘నువ్వే కావాలి’ సినిమాకు వెళ్లిందట. తాను ఈ సినిమా చూసి ఇంటికి చేరుకునే లోపే సినిమాకు వెళ్లిన విషయం ఇంట్లో లీకయ్యిందట. ఇక తన తల్లిదండ్రుల నుండి తన్నులు తప్పలేదని అంజలి చెప్పుకొచ్చింది. చెప్పకుండా సినిమాకు వెళ్లినందుకు డోస్ గట్టిగానే ఇచ్చారు. ఇక అప్పటి నుండి కాలేజ్‌కు బంక్ కొట్టి సినిమాలకు వెళ్లడం, ఫ్రెండ్‌తో తిరగడం మానేశా అంటూ అంజలి చెప్పుకొచ్చింది. ‘నువ్వే కావాలి’కి చెప్పకుండా వెళ్లినందుకు జరిగిన అనుభవంతో అన్నీ మానేశా అంటూ అంజలి నవ్వుతూ చెబుతోంది.