Site icon TeluguMirchi.com

సీత ఇప్పట్లో పెళ్లీ చేసుకోనంటోంది

anjaliతెలుగమ్మాయి అంజలి తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉంది. ఈ అమ్మడు తమిళ హీరో జైతో ప్రేమలో ఉందని గతకొంత కాలంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇటీవలె దోసె ఛాలెంజ్‌లో కూడా జై భార్యకు లేదా తల్లికి చేయాల్సిన దోసెను అంజలికి చేశాడు. దాంతో జై, అంజలిల ప్రేమపై క్లారిటీ వచ్చేసింది. అంతేకాకుండా ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు అని వార్తలు జోరుగా ప్రచారం అవుతూ వస్తున్నాయి.

తాజాగా మీడియాతో మాట్లాడిన అంజలి తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తాను లవ్‌లో కూడా లేనని, జై కేవలం మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్పుకొచ్చింది. అయినా ఈ స్నేహితులు అని చెప్పిన వారే ఏదో అలా ప్రేమ పుట్టి ప్రేమికులం అయ్యాం అంటూ తర్వాత మాట మారుస్తారులేండి.

తన చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, వాటన్నిటిని కూడా పూర్తి చేయాల్సిన భాద్యత ఉందని అంజలి చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా కెరియర్‌ మీదనే ఉందని, ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తనకు అవకాశాలు వచ్చేంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటాను అని వ్యాఖ్యానించింది.

పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని, పెళ్లి కుదిరితే తప్పకుండా అందరికి అధికారికంగా చెబుతాను అంటోంది. దీపం ఉన్పప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టుగా అవకాశాలు వస్తున్నప్పుడే వాటిని వాడేసుకోవాలని, పెళ్లి అయితే ఇదే ఊపుతో అవకాశాలు వస్తాయో లేదో అని అంజలి పెళ్లి విషయాన్ని పక్కన పెట్టి కెరియర్‌ మీద దృష్టి సారించింది.

Exit mobile version