Site icon TeluguMirchi.com

హెబ్బా పటేల్ తో జబర్దస్త్

hebba

వినవయ్యా రామాయ్యా చిత్రంలో ఇండస్ట్రీలోకి వచ్చాడు నాగ అన్వేష్. ఫస్ట్ సినిమా పెద్దగా క్లిక్ కాలేదు. ఇప్పుడు కాస్త టైమ్ తీసుకుని ఏంజెల్ అంటూ మరో సినిమాతో వస్తున్నాడు. తాజాగా టీజర్ బయటికివచ్చింది.

ఈ టీజర్ చూస్తుంటే ఇదో క్రైమ్ కామెడిలా వుంది. ఓ విగ్రహం చుట్టూ ఈ కధ నడుస్తుంది. హెబ్బా పటేల్ ఈ సినిమాలో ఏంజెల్ గా చేస్తోంది. కొంచెం ఫ్యాంటసీ టచ్ కూడా వుంది. మాంచి ఫన్ తో కూడిన క్యారెక్టర్ ఇది . ‘నాకు ఇదే కావాలి’ అంటూ ఆమె పలికిన ఓ డైలాగ్ ఫన్ పుట్టించింది. ఇక చివర్లో సప్తగిరి వేసిన ఓ డైలాగ్ జబర్దస్ ను గుర్తుకు తెస్తుంది.

తొలి సినిమా కోసం ఓ ప్రేమ కధను ఎంచుకున్నాడు నాగ అన్వేష్. ఐతే రెండో సినిమా విషయంలో రూటు మార్చాడు. సినిమాలో మాస్ జనాలకు నచ్చే ఎలిమెంట్స్ ను పొందుపరిచారు. మరి ఈ ఏంజిల్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Exit mobile version