బెంగాళీ భామ తో మహేష్ బాబు రొమాన్స్..

angana-royప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజాగా చిత్రం ‘శ్రీ మంతుడు ‘. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నికి మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం లో మహేష్ సరసన శృతిహాసన్ హీరొయిన్ గా నటిస్తుంది.

తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం లో రెండో హీరోయిన్ ఖరారు చేసారట. బెంగాళీ భామ అంగనా రాయ్ ని దర్శకుడు ఖరారు చేసినంటు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నఈ చిత్రానికి రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ రెండో సారి మహేష్ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.