యాంకర్ సుమ అరెస్ట్ ?


యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. అవ్వడానికి మళయాళీ అమ్మాయి అయినా తెలుగు వారి ఇంటి కోడలుగా వచ్చి తెలుగు భాష మీద పట్టు పెంచుకుంది. ఎక్కడైనా తన వాక్ చాతుర్యంతో అందరినీ కట్టిపడేస్తుంది సుమ. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటారు.

తాజాగా ఈమెను అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అవును అది నిజమే కంగారు పడకండి.. అదంతా అల్లరి నరేష్ ప్లాన్. ఏంటి ప్లాన్ నా..? అవునండి నరేష్ కొత్త సినిమా ఉగ్రం సినిమా ప్రమోషన్స్ కోసం ఇదంతా చేస్తున్నారు. సుమ ఏ ఇంటర్వ్యూ చేసిన ఆ కథకు తగ్గ కాస్ట్యూమ్ తోనో.. అందులో ఉన్న కంటెంట్ తోనో మొదలుపెడుతుంది. ఇక ఉగ్రంలో అల్లరి నరేష్ పోలీస్ కాబట్టి.. ఇలా సంకెళ్లతో కనిపించింది. ఉగ్రం సినిమా విషయానికొస్తే.. అల్లరి నరేష్, మీర్నా జంటగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉగ్రం. ఇక మే 5 న ఉగ్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.