ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారం అవుతున్న కామెడీ ప్రోగ్రాంలు మొదట్లో బాగానే నడిచినా కూడా ఆ తర్వాత మాత్రం బూతు పురాణాలే ఎక్కువయ్యాయి. సదరు ఛానెల్ వారు ప్రారంభించిన మరో ఛానెల్లో కూడా అలాంటి కార్యక్రమాలు చాలా పెరిగాయి. ఆ కార్యక్రమాలకు యాంకర్లుగా వ్యవహరించే శ్రీముఖి, రవిలు సిగ్గు లేకుండా ఇంట్లో కుటుంబాలు కలిసి ఈ కార్యక్రమాలు చూస్తారు అనే కనీస జ్ఞానం లేకుండా వల్గర్‌గా మాట్లాడుతున్నారు. అన్న, చెల్లి కలిసి కామెడీని ఆస్వాదించాలని ఈ కార్యక్రమాలను పెట్టగా వాటిలో ఉన్న బూతులు తట్టుకోలేక తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ బూతు పురాణాలు గతకొంత కాలంగా సాగుతూనే ఉన్నాయి.
కామెడీ అంటే బూతులేనా అని చాలామంది డైరెక్ట్‌గా విమర్శించినా కూడా సదరు యాంకర్ల తీరు మాత్రం అసలు మారడం లేదు. మరీ యాంకర్ శ్రీముఖి, రవిలు అయితే విచ్చలవిడిగా బూతులు మాట్లాడుతున్నారు. వీరు చేసే వల్గర్ అల్లరిని చూసి లైవ్‌లోనే తిట్టిపోస్తున్నారు ప్రేక్షకులు. ఎంతమంది ఎలా తిట్టినా కూడా రవి, శ్రీముఖిలకు మాత్రం బుద్ది రావడం లేదు. ఈ ఇద్దరు రెచ్చిపోయి మరీ నోటికి వచ్చిన బూతులను వదిలేస్తున్నారు. రవి, శ్రీముఖిలు చేసే ఆ కార్యక్రమాలు కామెడీ కార్యక్రమాలలాగా కాకుండా బూతు పురాణం లాగా అనిపిస్తున్నాయని ప్రేక్షకులు చాలా ఫీల్ అవుతున్నారు. అసలు ఇంకెన్నాళ్లు ఇలా బూతులు వాడుతూ రేటింగ్‌లు తెచ్చుకుంటారు? చానెళ్ల మీద ఉన్న కనీస గౌరవం కూడా లేకుండా పోతుంది అని బుల్లితెర ప్రేక్షకులు అంటున్నారు.