ఛీ..ఛీ.. నాగ్‌ మరదలే చెర్రీకి మరదలా..?

Anasuya-comments-mega-fansబుల్లితెరపై అందాలు ఆరబోస్తూ హాట్‌ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఒకవైపు బుల్లితెరపై వరుస కార్యక్రమాలను చేస్తూనే మరోవైపు వెండితెరపై కనిపించడానికి వచ్చిన అవకాశాలను వాడుకుంటోంది. ఈ అమ్మడు ఇప్పటికే యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత స్టార్‌ హీరోల చిత్రాలలో కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఐటెంగా కూడా ఆడిపాడి అన్నింట్లో తనకు సత్తా ఉందని నిరూపించుకోవడం కోసం అనసూయ వచ్చిన అవకాశాలన్నిటికి కూడా ఒకే చెబుతుంది. తాజాగా ఈ అమ్మడికి మరోస్టార్‌ హీరో చిత్రంలో అవకాశం వచ్చింది.

ram charanఇప్పటికే ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నాగ్‌ సరసన మరదలిగా ఆడిపాడిన అనసూయ ఇప్పుడు మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ చిత్రంలో కూడా నటిస్తోంది. నాగ్‌ మరదలిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు చెర్రీ చిత్రంలో కూడా మరదలిగానే నటిస్తోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అనసూయ చెర్రీ పక్కన మరదలిగా ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఛీ.. ఛీ.. నాగ్‌ మరదలే చెర్రీకి మరదలా..??, చెర్రీ మరదలిగా నటించడానికి మరెవరు దొరకలేదా ఈ ముదురుభామను తీసుకున్నారు అని మెగా అభిమానులు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్‌ హీరో నాగ్‌ సరసన మరదలిగా బాగా సెట్‌ అయిన ఈ అమ్మడు చెర్రీకి మరదలిగా నప్పుతుందా అనేది కాస్త ఆలోచించదగ్గ విషయమే.