నాగ్ తో హట్ యాంకర్ రొమాన్స్..?

Nag-Anusyaటాలీవుడ్ మన్మధుడు నాగార్జున పక్కన జబర్దస్త్ హట్ యాంకర్ అనసూయ మరదలు గా రొమాన్స్ చేయనుందని ఫిలిం నగర్ టాక్. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ అనే చిత్రం లో నాగ్ పక్కన ఈ హట్ ముద్దు గుమ్మ నటించనుంది.

ఇక ఈ చిత్రం లో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నాడు. లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హంసా నందిని ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఫై ఈ చిత్రం తెరకెక్కనుంది.