టబు ఛాన్స్ కొట్టేసిన అనసూయ..?

గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ కు వెంకీ కుడుముల భీష్మ చిత్రం ఇచ్చి ఊపిరి పోసాడు. నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు నితిన్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న నితిన్..సోమవారం కొత్త సినిమా ప్రారభించాడు.

శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం. 6 చిత్రంలో నటిస్తున్నాడు. హైదరాబాద్ లో ఈ మూవీ పూజా కార్య క్రమాలు అట్టహాసం గా జరిగాయి. ప్రముఖ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొత్తగా దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. బాలీవుడ్ మూవీ అందదున్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మేర్ల పాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఒరిజనల్ అందదున్ లో లేడీ విలన్ గా టబు నటించింది. అక్రమ సంబంధం నెరిపే క్రిమినల్ లేడీగా ఆమె పాత్ర ఉంటుంది. సినిమా మొత్తం హీరో ఆయుశ్మాన్ ఖురానా మరియు టబు చుట్టే తిరుగుతుంది..ఇప్పుడు తెలుగు లోను ఆమెనే తీసుకుంటారని అంత అనుకున్నారు కానీ ఆమెను కాకుండా రంగమ్మత్త అనసూయ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం అనసూయ వరుస క్రేజ్ ప్రాజెక్ట్ లలో నటిస్తుంది.