కథనం విడుదలై వారం రోజులు కూడా కాకుండానే కొత్త సినిమా గురించి అనసూయ అనౌన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అమ్మడు తాజాగా ఒక కథ విన్నదట. ఆ కథ టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎవరు చేయలేదట. ఖచ్చితంగా అది ట్రెండ్ సెట్టింగ్ సినిమా అవుతుందనే నమ్మకంతో అనసూయ ఆ కథకు ఒప్పుకుంది. త్వరలోనే సినిమా మొదలు కాబోతుంది అంటూ ప్రకటించింది. సినిమా దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు అనే విషయాలపై ఎలాంటి క్లారిటీని ఈ అమ్మడు ఇవ్వలేదు. తాజగా అనసూయ చేసిన కథనంకు పూర్తి విరుద్దంగా చేయబోతున్న సినిమా ఉంటుందట.