‘కథనం’ పోయింది కొత్త కథకు ఓకే చెప్పింది

బుల్లి తెరపై ఎంతో బిజీగా ఉన్న అనసూయ బ్యాక్‌ టు బ్యాక్‌ వెండితెరపై కూడా కనిపిస్తోంది. ఈ అమ్మడు తాజాగా ‘కథనం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మన్మధుడు 2’ చిత్రంకు పోటీ అన్నట్లుగా కథనం చిత్రం విడుదల అయ్యింది. నాగార్జున మన్మధుడు 2 చిత్రం ఫలితం తలకిందులు అయినా కూడా కథనంకు సరైన కలెక్షన్స్‌ రాలేదు. ఏమాత్రం ఆకట్టుకోని కథనంతో ఈ చిత్రం ను దర్శకుడు తెరకెక్కించాడు. దాంతో ప్రేక్షకులు సినిమాను కాదన్నారు. తాజాగా అనసూయ తన కొత్త సినిమాను అనౌన్స్‌ చేసింది.

కథనం విడుదలై వారం రోజులు కూడా కాకుండానే కొత్త సినిమా గురించి అనసూయ అనౌన్స్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అమ్మడు తాజాగా ఒక కథ విన్నదట. ఆ కథ టాలీవుడ్‌లో ఇప్పటి వరకు ఎవరు చేయలేదట. ఖచ్చితంగా అది ట్రెండ్‌ సెట్టింగ్‌ సినిమా అవుతుందనే నమ్మకంతో అనసూయ ఆ కథకు ఒప్పుకుంది. త్వరలోనే సినిమా మొదలు కాబోతుంది అంటూ ప్రకటించింది. సినిమా దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు అనే విషయాలపై ఎలాంటి క్లారిటీని ఈ అమ్మడు ఇవ్వలేదు. తాజగా అనసూయ చేసిన కథనంకు పూర్తి విరుద్దంగా చేయబోతున్న సినిమా ఉంటుందట.