Site icon TeluguMirchi.com

ఆర్బీఐ కబురుతో పండగ చేసుకుంటున్న అనసూయ

బుల్లితెర & వెండి తెరపై రాణిస్తున్న అనసూయ సోషల్ మీడియా లోను మూడున్నర మంది మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటూ వస్తుంది. తల్లి పోస్ట్ లో ఉన్న కానీ అనసూయ అందాలు మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు…రోజు రోజుకు అమ్మడు రేంజ్ పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉండే ఈ భామ. తాజాగా చేసిన పోస్ట్ ఆమెను వివాదాల్లోకి నెట్టింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు సైతం పలు ఆంక్షలు విధించారు. వీటిపై కేటీఆర్ కు అనసూయ ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేసింది. కేటీఆర్ సర్.. ప్రభుత్వం చెప్పింది పాటించాలి.. కానీ, కొన్ని ప్రొఫెషన్స్ విషయంలో మాత్రం ఈ పద్ధతులు సడలించండి అంటూ విజ్ఞప్తి చేసింది. మేం పని చేయకపోతే మాకు డబ్బులు రావు.. కానీ, మేం మా ఇంటి రెంట్ కట్టుకోవాలి.. కరెంట్ బిల్లు కట్టుకోవాలి.. ఈఎంఐ భరించాలి. నెలసరి బిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి, కాస్త మాపై దయ చూపించండి అంటూ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేసింది. ఈ రిక్వెస్ట్ ఫై నెటిజన్లు ఫైర్ అయ్యారు.

ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితుల దృష్యా రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం ఇచ్చింది. మూడు నెలల పాటు EMI, క్రెడిట్ కార్డ్ బిల్‌లు చెల్లించక్కర్లేదని దీనిపై బ్యాంకర్లు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే తమకు ఆర్బీఐ నుండి ఉత్తర్వులు ఏమీ రాకపోవడంతో వివిధ బ్యాంక్‌లు EMI, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ లోన్స్ కట్టాలని వినియోగదారులకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతూ మరో ట్వీట్ చేసింది అనసూయ.

Exit mobile version