Ananya Nagalla : బుజ్జమ్మగా అనన్య నాగళ్ళ.. లుక్ అదుర్స్


యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘పొట్టేల్’. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన కంటెంట్‌కు అద్భుతమైన స్పందన రాగా, తాజాగా గురువారం అనన్య నాగళ్ల బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

Also Read : నన్నుపెళ్లి చేసుకో లైఫ్ ఇస్తా !!

ఈ పోస్టర్ లో అనన్య రూరల్ ట్రెడిషనల్ లుక్ లో చాలా నేచురల్ గా కనిపించారు. ఇందులో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. బుజ్జమ్మగా అనన్య క్యారెక్టర్ ఎక్స్ ట్రార్డినరీగా వుండబోతోందని మేకర్స్ తెలిపారు. ఈ మూవీలో అజయ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తుండగా.. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : ‘విశ్వం’ నుంచి జర్నీ అఫ్ విశ్వం.. ‘వెంకీ’ సినిమా ట్రైన్ ఎపిసోడ్ రిపీట్..