Site icon TeluguMirchi.com

విజయ్ దేవరకొండ తమ్ముడికి సపోర్ట్ గా రష్మిక మందాన్న..


రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ఇప్పుడు ఈ హీరో బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో ఆమె హీరోయిన్‏గా వెండితెరకు పరిచయం కాబోతుంది.ఇక ఎస్కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, సాయిరాజేష్ నీలం దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా ‘ప్రేమిస్తున్నా’ అనే మూడో పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ పాటను నేషనల్ క్రష్ రష్మిక మందాన్న లాంచ్ చేయడం విశేషంగా మారింది. ‘ప్రేమిస్తున్నా … ప్రేమిస్తున్నా .. నీ ప్రేమలో జీవిస్తున్నా’ అంటూ సాగే ఈ పాటకు సురేశ్ బానిశెట్టి సాహిత్యాన్ని అందించగా.. రోహిత్ ఆలపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ క్యాచీ ట్యూన్ ను అందించారు. సాంగ్ వినసొంపుగా ఉంది.

అనంతరం రష్మిక మందాన్న మాట్లాడుతూ.. ‘ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ నాకు బాగా నచ్చింది. ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాటను లూప్ మోడ్‌లో వింటూనే ఉన్నాను. ఆనంద్‌ మ్యూజిక్‌ టేస్ట్‌కు నేను ఫ్యాన్. బేబీ టీంకు ఆల్ ది బెస్ట్. విరాజ్, వైష్ణవికి కంగ్రాట్స్. నన్ను ఈవెంట్‌కు పిలిచినందుకు టీంకు థాంక్స్’ అని అన్నారు.

సాయి రాజేష్‌ మాట్లాడుతూ.. ‘రష్మిక లాంటి స్టార్‌లు ఈ పాటను ప్రమోట్ చేయడం అవసరం. మా కోసం వచ్చిన రష్మికకు థాంక్స్. ఈ సినిమాను జూలై 14న రిలీజ్ చేయబోతోన్నాం’ అని అన్నారు. ఇక ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ఇది ఒక మ్యూజికల్ ఫిల్మ్. ఓ నలభై, యాభై ఏళ్ల తరువాత కూడా ఈ పాటను వింటాం. ఇక మా కోసం వచ్చిన రష్మికకు థాంక్స్. బేబీ సినిమా అందరికీ నచ్చతుంది’ అని అన్నారు.

Baby - Premisthunna Lyrical | Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin | Vijai Bulganin

Exit mobile version