అంజలి క్షేమంగానేవుంది!

anjaliతన పిన్ని భారతీదేవి, దర్శకుడు కళంజియం వల్ల ఎదుర్కొంటున్న వేధింపులను మీడియా తెలిపిన హీరోయిన్ అంజలి సోమవారం నుంచి కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అంజలి జాడ కోసం గాలింపు చర్యలు కూడా జరిగాయి. అంజలి సోదరుడు జూబ్లిహిల్స్ పోలీసు స్టేసన్ లో ‘అంజలి కనబడుట లేదు’ అని
ఫిర్యాదు కూడా చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం అంజలి క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఆమె తన తల్లికి ఫోన్ చేసింది. తాను క్షేమంగానే ఉన్నానని, కావాలనే అజ్ఞాతంలోకి వెళ్లానని వెల్లడించింది. అంజలి క్షేమంగా ఉందని తేలడంతో కుటుంబ సభ్యులు ఉపిరి పీల్చుకున్నారు. అయితే పోలీసులు మాత్రం ఆమె ఎక్కడ ఉందనే వివరాలు ఇంకా తెలియదని అంటున్నారు. ప్రస్తుతం ఆమె బెంగుళూరు పరిసరాల్లో ఉన్నట్లు సమచారం.