అతిథి సినిమా గుర్తుందా? అందులో మహేష్‌బాబుని తెగ ప్రేమించేసిన అమ్మడు అమృతారావు. ఆ తరవాత తెలుగులో అవకాశాలు రాలేదు. ఆ సినిమా చేసి అట్నుంటి అటే ముంబై చెక్కేసింది. ఇప్పుడు మళ్లీ ఆమెకు పిలుపు వచ్చింది. ఏకంగా నందమూరి బాలకృష్ణ సినిమా కోసం. బాలకృష్ణ – బోయపాటి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సోనాల్ చౌహాన్ ఓ కథానాయిక. చాలా కాలం నుంచి ప్రధాన నాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. ఇప్పుడు ఈ రేసులో అమృతారావు వచ్చింది. అమృతకు ఇటీవలే ముంబైలో బోయపాటి కథ వినిపించారు. ఆమె కూడా బాలయ్యతో జత కట్టడానికి సిద్ధమైంది. అందరూ ముందు ఇలా ఒప్పుకొన్నవారే. ఆ తరవాతే సైడ్ అయిపోయారు. అమృత అయినా ఉంటుందా? లగెత్తుతుందా?