Site icon TeluguMirchi.com

టాలీవుడ్ ని ఫాలో అవుతున్న బిగ్ బి

”ట్విటర్‌..నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గించేశావు. ఇది జోక్‌గా అనిపిస్తోంది. నిన్ను వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది. ఆసక్తికరమైన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. థాంక్యూ’ అంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన కామెంట్ తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే వున్నటుండి ఆయన కొంతమందిని ఫాలో అవుతున్నట్లు నోటిఫికేషన్ లు వస్తున్నాయి. ఇందులో తెలుగు సెలబ్రిటీలు కూడా వున్నారు.

అల్లు అర్జున్, అక్కినేని నాగ చైతన్య, అఖిల్, నందమూరి కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, నిఖిల్, సందీప్ కిషన్, అల్లరి నరేష్, మంచు మనోజ్… హీరోయిన్లు కాజల్, తమన్నా, రకుల్, అనుపమా పరమేశ్వరన్, మెహరీన్, లావణ్యా త్రిపాఠి, ఇలా చాలా మందిని అమితాబ్ ఫాలో అవుతున్నట్లు నోటిఫికేషన్ లు వచ్చాయి. అసలు ఈ విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కావటం లేదు జనాలకి.

Exit mobile version