బిగ్ బి ట్విట్టర్ కవిత

”ట్విటర్‌..నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గించేశావు. ఇది జోక్‌గా అనిపిస్తోంది. నిన్ను వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది. ఆసక్తికరమైన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. థాంక్యూ’ అంటూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయ్యింది. అయితే ట్విట్టర్ ప్రతినిధులు కొందరు ఈ విషయంలో అమితాబ్ ను కలసి వివరణ ఇచ్చుకున్నారు.

దీంతో అయిన కాస్త కూల్ అయినట్లు వున్నారు. అందుకే ట్విట్టర్ పై ఓ కవిత రాశారు. ”ట్విటర్‌..నేను ఏదన్నా పోస్ట్‌ చేద్దామనుకుంటే నువ్వు నన్ను అనుమతించడంలేదు. ఇప్పటికే నా 2 లక్షల మంది ఫాలోవర్లను తగ్గించేశావ్‌. కనీసం నేను నీకోసం పోస్ట్ చేసిన కవిత్వాన్ని మాత్రం తొలగించకు. నాతో ఇంత దారుణంగా ప్రవర్తించకు. నీకు ఎందరో అభిమానులు ఉన్నారు. భయమనేదే లేదు నీకు. కానీ నీకు కోపం వస్తే మేము ఎక్కడికి వెళ్లాలి? నీ ఆశీర్వాదాలు మాపై ఉంటే మా పదాలను పువ్వుల్లా నీపై కురిపిస్తాం”అని అర్ధం వచ్చేలా ఓ కవిత రాసి పోస్ట్ చేశారు బిగ్ బి.