Site icon TeluguMirchi.com

‘‘ప్రాజెక్ట్‌ కె” లో గాయపడ్డ అమితాబ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ) గాయపడ్డారు. ‘ప్రాజెక్ట్‌ కె’ షూట్‌లో ఆయనకు దెబ్బలు తగిలాయి. ఈ విషయాన్ని తన బ్లాగ్‌ వేదికగా బిగ్‌బీ తెలియజేశారు. గాయం కారణంగా తాను పాల్గొనాల్సిన షూట్స్‌ అన్నింటినీ వాయిదా వేసుకున్నట్లు చెప్పారు.

‘‘ప్రాజెక్ట్‌ కె’ షూట్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో నేను గాయపడ్డాను. యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు కుడివైపు పక్కటెముకలకు దెబ్బ తగిలింది. షూట్‌ రద్దు చేసుకుని వైద్యులను సంప్రదించాను. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో తగిన చికిత్స తీసుకున్నాను. ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఇబ్బందిగా ఉండటంతో వైద్యులు కొన్ని వారాల పాటు విశ్రాంతి సూచించారు. అందువల్ల పనులన్నింటినీ కొంతకాలంపాటు వాయిదా వేసి.. ముంబయిలోని ఇంట్లో రెస్ట్‌ తీసుకుంటున్నాను” అని చెప్పారు అమితాబ్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ‘‘ప్రాజెక్ట్‌ కె’ని తెరకెక్కిస్తున సంగతి తెలిసిందే.

Exit mobile version