బిగ్ బి బుల్లి ఫ్యాన్

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ కు ఓకే మంచి అలవాటు ఉంది. ప్రతి ఆదివారం వందలాది మంది అభిమానులు అమితాబ్‌ని చూడటానికి ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తుంటారు. వారి కోసం అమితాబ్‌ బయటికి వచ్చి ఓ స్టూల్‌పై నిలబడి అభివాదం చేస్తుంటారు. అప్పుడప్పుడూ ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు కూడా ఇస్తుంటారు.

ఎప్పటిలాగే మొన్న ఆదివారం అమితాబ్‌ను చూసేందుకు అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే బిగ్‌బి వారిని పలకరిస్తుండగా గుంపులోంచి ఓ చిన్నారి నేరుగా అమితాబ్‌ వద్దకు వెళ్లిపోయింది. ఆ చిన్నారి ధైర్యాన్ని చూసి అమితాబ్ ఆశ్చర్యపోయారు.

ఈ విషయాన్ని పేస్ బుక్ లో చెప్పారు. ‘ నా ఇంటి వద్దకు వచ్చిన అభిమానుల గుంపును దాటుకుంటూ హాయ్‌ చెప్పడానికి ఈ చిన్నారి నా కోసం వచ్చింది. ‌సో క్యూట్‌’ అని అమితాబ్‌ ట్వీట్‌లో చెప్పారు.