Site icon TeluguMirchi.com

కరోనా బారిన పడిన క్రేజీ సింగర్

కరోనా మహమ్మారి ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదు. చిన్న , పెద్ద, ధనిక , పేద అనే తేడాలు లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలువురు సినీ నటి నటులు ఈ కరోనా బారిన పడి ప్రాణాలు విడువగా..కొంతమంది హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఓ ప్రముఖ సింగర్ కు వైరస్ సోకినట్లు తేలింది.

అమెరికా కంట్రీ సింగర్‌ కేలీ షోర్‌(25) కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో వెల్లడించారు. తాను క్వారంటైన్‌లో ఉన్నానని.. అయినా తనకు మహమ్మారి సోకిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు… ‘‘ మూడు వారాలుగా ఇంటికే పరిమితమయ్యాను. కేవలం నిత్యావసరాల కోసం మాత్రమే బయటకు వెళ్లాను. అయినా కరోనా సోకింది. అప్పటి నుంచి గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నా. ఒళ్లు నొప్పులు, జ్వరం, రుచిమొగ్గలు, ముక్కు పనిచేయడం మానేశాయి. దీనిని బట్టి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ కొంతమంది ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం నాకు విసుగు తెప్సిస్తోంది’’ అని కేలీ ట్వీట్‌ చేశారు.

Exit mobile version