అమలా పాల్‌ కు వినయమెక్కువట…!

Amala-Paulఅమలా పాల్‌… ఇటీవలి కాలంలో తన నటనో లేక వినయం తోనో … లేక కారణమేమైనా సరే గానీ వరుసగా మంచి అవకాశాలను చేజిక్కించుకుంటూ వస్తోంది. మెగా ఫ్యామిలీలో చరణ్‌ సరసన విడుదలకు సిద్ధంగా ఉన్న “నాయక్‌”లో, అల్లు అర్జున్‌ సరసన “ఇద్దరమ్మాయిలతో”లో తనూ ఓ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇప్పటివరకూ ఒక్క “లవ్‌ ఫెయిల్యూర్‌”లో సిద్ధూ సరసన మాత్రమే చెప్పుకోదగ్గ పాత్రలో నటించినప్పటికీ, ప్రస్థుతానికయితే పెద్ద ఆఫర్లనే సొంతం చేసుకుంటూ వస్తోంది. గ్లామర్‌ తో పాటు మంచి అభినయం కూడా చూపించగలనని తమిళ డబ్బింగ్‌ సినిమాలు “నాన్న”, “ప్రేమఖైదీ” లతో ఇప్పటికే నిరూపించుకుంది. ఇప్పుడు తాజాగా ఓ భారీ స్టేట్‌ మెంట్‌ ఇచ్చి మరోసారి మరిన్ని అవకాశాలు తన అకౌంట్‌ లో వేసుకునే పనిలో పడిందీ ముద్దుగుమ్మ. “నేనింకా దర్శకులను ఎంచుకునే స్థాయికి రాలేదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకునే స్టేజ్‌ లోనే ఉన్నాను. ఫలానా దర్శకుడితో అని కాకుండా ప్రతి ఒక్క దర్శకుడితోనూ కలిసి పనిచేసి నా నటనను మెరుగుపరచు కోవాలనుకుంటున్నాను” అంటూ తన వినయాన్ని చాటిచెప్పుకుంటోంది అమలా పాల్‌. చూడాలి మరి ఈ వినయవిధేయతలు తనకెలాంటి ఆఫర్లు తెచ్చి పెడతాయో!