Site icon TeluguMirchi.com

ద‌ర్శ‌కుడిని పెళ్లాడ‌బోతున్న అమ‌లాపాల్‌?

amala paul

అమ‌లాపాల్ పెళ్లి చేసుకోబోతోందా? అదీ… ఓ ద‌ర్శ‌కుడిని. ఔన‌నే అంటున్నాయి త‌మిళ సినీ వ‌ర్గాలు. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు… విజ‌య్‌. విక్ర‌మ్‌తో నాన్న తీసిన ద‌ర్శ‌కుడీయ‌న‌. ఆ సినిమాలో అమ‌లాపాల్ కూడా న‌టించింది. అప్ప‌టి నుంచీ విజ‌య్ – అమ‌లాపాల్ మ‌ధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింద‌ని, ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నార‌ని వార్త‌లొచ్చాయి. ఆ వార్త‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తూనే ఉంది అమ‌లాపాల్‌. అయితే… ప్రేమ వ్య‌వ‌హారానికి మాత్రం పుల్‌స్టాప్ పెట్ట‌లేదు. తాజాగా వీరిద్ద‌రూ పెళ్లి చేసుకొందామ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచార‌మ్‌. ఈమ‌ధ్య విజ‌య్ కొత్త సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం చెన్నైలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి అమ‌లాపాల్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు విజ‌య్‌. ఆ కార్య‌క్ర‌మంలో విజ‌య్‌.. ఆమెకిచ్చిన మ‌ర్యాద‌, ఇద్ద‌రి సాన్నిహిత్యం చూసి… అక్క‌డివాళ్లంతా చెవులు కొరుక్కొన్నారు. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రూ ఒక్క‌టి కాబోతున్నార‌న్న ప్ర‌చారానికి వేదిక‌పై వీళ్ల ప్ర‌వ‌ర్త‌న ఆజ్యం పోసింది. మ‌రి పెళ్లిక‌బురు వినిపిస్తారా? లేదంటే మేం స్నేహితులం మాత్ర‌మే.. అనే రొటీన్ డైలాగ్ చెప్పి త‌ప్పించుకొంటారా? అన్న‌ది చూడాలి.

Exit mobile version