Site icon TeluguMirchi.com

నీకు మతి ఉండే ఇలా చేస్తున్నావా అమలా

amala-paullముద్దుగుమ్మ అమలాపాల్‌ దర్శకుడు విజయ్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత తరుచుగా మీడియాలోకి వస్తూనే ఉంది. ఈ అమ్మడికి విడాకుల తర్వాత కూడా వరుస ఆఫర్‌లు వస్తూనే ఉన్నాయి. పెళ్లయి విడాకులు అయిన అమలాపాల్‌కు అవకాశాలు రావడం గగనమే అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ అమ్మడి అందం, అభినయం వల్ల వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అమలాపాల్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో విషయమై ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతూ ఉంది. అమలా పోస్ట్‌ చేసిన ఆ వీడియోలో తానే స్వయంగా కారును నడుపుతూ, పాటలు పాడుతూ వాటిని తన కెమెరాలో బంధించింది. కెమెరాని ముందుగానే ఫిక్స్‌ చేసి కారు నడుపుతూ, పాటలు పాడుతూ అప్పుడప్పుడు కెమెరా వైపు చూస్తు ఫోజులు ఇచ్చింది.

ఇదంతా చేసి గమ్మున ఊరుకోక ఆ వీడియోను కాస్త సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియోను చూసిన అమలా అభిమానులు ఖుషీ అయ్యారు. కానీ చాలామంది నెటిజన్లు ఈ వీడియో చూసి అమలాపై విమర్శలు చేస్తున్నారు. పాటలు పాడుతూ కారు నడపడమే కాస్త ప్రమాదం, అలాంటిది కెమెరా వైపు ఫోజులు ఇస్తూ కారు డ్రైవ్‌ చేయడం ఎంత వరకు కరెక్ట్‌. అసలే ఈ కాలంలో యూత్‌ సెలబ్రిటీలు ఏది చేస్తే దాన్ని ఇట్టే ఫాలో అవుతున్నారు. అమలా చేసిన ఇలాంటి పనులు యూత్‌ చేయబూని ప్రమాదాలు కొని తెచ్చుకోరా అంటూ విమర్శలు చేస్తున్నారు. నీకు మతి ఉండే ఇలాంటి వీడియోలు షేర్‌ చేశావా అని అమలాపై మొట్టి కాయలు మొట్టుతున్నారు.

Exit mobile version