హీరోయిన్ అమలాపాల్ మాజీ భర్త డైరక్టర్ విజయ్ కి బెస్ట్ విషస్ చెప్పింది. అమల మాజీ భర్త విజయ్ ఇటీవలె మళ్లీ వివాహం చేసుకున్నారు. దీనిపై ఒక ఇంటర్యూలో స్పందించిన అమల `విజయ్ చాలా స్వీట్ పర్సన్. అద్భుతమైన వ్యక్తి. అతని జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. ఆ దంపతులకు ఎక్కువమంది పిల్లలు పుట్టాలని ఆకాంక్షిస్తున్నానని అమల చెప్పింది.
చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చి హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది అమలాపాల్. హీరోయిన్గా బాగా బిజీగా ఉన్న సమయంలోనే దర్శకుడు ఏ ఎల్ విజయ్ను వివాహం చేసుకుంది. రెండేళ్లకే భర్త నుంచి విడాకులు తీసుకుని హీరోయిన్గా మళ్లీ బిజీ అయింది అమలాపాల్. అలాగే విడాకుల తర్వాత తనకు అవకాశాలు వస్తాయని అనుకోలేదని, ఆంటీ పాత్రలు, సీరియల్స్‌లోనే నటించాలేమోనని భయం వేసిందని చెప్పింది. అయితే మనలో టాలెంట్ ఉంటే అవకాశాలకేం కొదవ ఉండదని మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అర్థమైందని తెలిపింది.