అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా ఈ సినిమా ఆడటం లేదు. ఎంత బోల్డ్‌గా ఉంటే ఏం లాభం కనీసం కాన్సెప్ట్ ఉండాలి కదా అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలోనే అమలాపాల్ ఆర్థికంగా కూడా నష్టపోయినట్లుగా తెలుస్తోంది. ఆడై సినిమా విడుదలకు ముందు నిర్మాతలు ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురయ్యారు. ఫైనాన్షియర్స్కు ఇవ్వాల్సిన మొత్తం సర్దుబాటు కాకపోవడంతో నిర్మాతల నుండి తీసుకున్న పారితోషికంతో పాటు మరి కొంత మొత్తంను కూడా అమలాపాల్ ఇచ్చిందట. సినిమా సక్సెస్ అయితే అంతకు మించి వస్తాయనే నమ్మకంతో అమలా పాల్ ఇలా చేసింది. కాని సినిమా ఫలితం బెడిసి కొట్టింది.