తమిళంలో అమలాపాల్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ఆడై’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆడై చిత్రంలో అమలా పాల్ ఏ స్థాయిలో నటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పూర్తి న్యూడ్‌గా నటించడంతో పాటు, పలు సీన్స్ లో చాలా బోల్డ్‌గా నటించింది. తెలుగులో ఆమె అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రంను విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులకు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది.
అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా ఈ సినిమా ఆడటం లేదు. ఎంత బోల్డ్‌గా ఉంటే ఏం లాభం కనీసం కాన్సెప్ట్ ఉండాలి కదా అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలోనే అమలాపాల్ ఆర్థికంగా కూడా నష్టపోయినట్లుగా తెలుస్తోంది. ఆడై సినిమా విడుదలకు ముందు నిర్మాతలు ఆర్థిక పరమైన ఇబ్బందులకు గురయ్యారు. ఫైనాన్షియర్స్‌కు ఇవ్వాల్సిన మొత్తం సర్దుబాటు కాకపోవడంతో నిర్మాతల నుండి తీసుకున్న పారితోషికంతో పాటు మరి కొంత మొత్తంను కూడా అమలాపాల్ ఇచ్చిందట. సినిమా సక్సెస్ అయితే అంతకు మించి వస్తాయనే నమ్మకంతో అమలా పాల్ ఇలా చేసింది. కాని సినిమా ఫలితం బెడిసి కొట్టింది.