మా అమ్మ ఐరిష్ మహిళ. కానీ చూడడానికి అచ్చం భారతీయురాలిలాగే ఉంటారు, కొందరు భారతీయుల కంటే మీ అమ్మ అసలైన భారతీయురాలిలా ఉంటుందని మా అత్తగారు అంటుండేవారు. నాన్నగారు భారతీయుడే, పుట్టింది ఈస్ట్ బెంగాల్‌లోని ఢాకా కానీ పెరిగింది ఉత్తరప్రదేశ్‌లోనే. నౌకాదళంలో పనిచేశారు. ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్‌గా మారక ముందు సంగతి ఇది. కాబట్టి చరిత్రను అర్థం చేసుకోవాలి, అప్పుడే దేశ విభజన వల్ల కలిగిన బాధ, నష్టాలు అర్థం అవుతాయి. కమాండర్ ఎమ్‌కె ముఖర్జీ భారతీయుడు, బెంగాలీ అంటు తల్లిదండ్రుల గురించి చెబుతూ అమలా ఎమోషనల్ అయింది.