‘చరణ్ ‘కు బన్నీ డేట్స్

Yevadu-by-Ram-Charan-and-Allu-Arjunవంశీ పైడిపల్లి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరో నటిస్తున్న చిత్రం ఎవడు. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ బన్నీ ఓ గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం బన్నీ ఏప్రిల్ 5 నుండి షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇద్దరమ్మాయిలతో చిత్రం షూటింగ్ తరువాత బన్నీ స్పెయిన్ నుంచి రాగానే ‘ఎవడు’ షూటింగ్ లో బిజీ కానున్నాడు , అల్లు అర్జున్ కి జంటగా కాజల్ అగర్వాల్ కూడా ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనుంది. థ్రిల్లర్ నేపద్యం లో సాగే ‘ఎవడు’ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా దేవిశ్రీ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.