పాన్ ఇండియా స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్. పుష్ప ది రైజ్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కాగా బన్నీ బర్త్ డే సందర్భంగా నిన్న వేర్ ఈజ్ పుష్పా అంటూ సినిమా ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసాక మాసివ్ రెస్పాన్స్ రాగ, ఊహించని ఫస్ట్ లుక్ తో అయితే బన్నీ క్రేజీ ట్రీట్ ని అందించాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్పరాజ్ మయంగా మారిపోయింది.
ముఖ్యంగా ఫస్ట్ లుక్ అయితే సోషల్ మీడియాను ఏలుతుంది. అంతేకాదు కేవలం కొన్ని గంటల్లోనే ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లలో మోస్ట్ లైక్డ్ ఫస్ట్ లుక్ గా రికార్డు నెలకొల్పింది. మొత్తానికి అయితే పుష్ప రాజ్ రూలు మామూలు లెవెల్లో స్టార్ట్ కాలేదని చెప్పాలి. ఇక సినిమాపై కూడా భారీస్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి.
PUSHPA RAJ is RULING Social Media
#Pushpa2TheRule is the MOST LIKED FIRST LOOK of all time on FB, Twitter & Insta
– https://t.co/BEhjjDNGSl#HappyBirthdayAlluArjun
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/HlkNj42jkH
— Sukumar Writings (@SukumarWritings) April 8, 2023